CAA వ్యతిరేక ఆందోళనల ముసుగులో ఉగ్రదాడికి ప్లాన్.. దంపతుల అరెస్ట్

CAA వ్యతిరేక ఆందోళనల ముసుగులో ఉగ్రదాడికి ప్లాన్.. దంపతుల అరెస్ట్
x
Highlights

CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద...

CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మాడ్యూల్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక టీం ఆదివారం ఈ జంటను అరెస్టు చేసింది. జహానాజైబ్ సమి అతని భార్య హినా బషీర్ బీ గా వీరిని గుర్తించారు. వీరిద్దరిని దేశ రాజధాని ఓఖ్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ యొక్క ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) అని కూడా పిలువబడే విలాయత్ ఖొరాసాన్తో తమకు సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో దంపతులను అరెస్ట్ చేశారు పోలీసులు.అనంతరం ఈ జంటను ఆదివారం ఢిల్లీ లోని పాటియాలా హౌస్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి మార్చి 17 వరకు పోలీసు రిమాండ్‌కు పంపారు.

అఫ్ఘానిస్తాన్‌లోని ఐసిస్‌ సభ్యులతో రెగ్యులర్‌గా వీరిద్దరూ సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన NRC, CAAకి వ్యతిరేకంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడంతోపాటు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్నారని సమాచారం తెలుసుకున్నారు. కాగా జహన్‌బెబ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్‌ చేస్తున్నాడు.. ఈ దంపతులు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇండియన్‌ మస్లిమ్స్‌ యూనిటీ పేరిట సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఆ క్రమంలో సోషల్ మీడియాలో పలు అభ్యంతరకర పోస్టులను షేర్ చేసింది.

కాశ్మీర్‌లో శ్రీనగర్‌లోని శివపోరాకు చెందిన ఈ జంట గత ఏడాది ఆగస్టు నుంచి ఢిల్లీ లోని జామియా నగర్‌లోని ఓఖ్లా విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. జహానాజైబ్ మరియు హినాపై సమాచారం సేకరించిన ఇంటెలిజెన్స్ బృందంలో భాగమైన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, భార్యాభర్తలు ఆఫ్ఘనిస్తాన్లోని సీనియర్ ISKP సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ వ్యక్తుల లక్ష్యం సవరించిన పౌరసత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనను ఉపయోగించుకోవడమే..

ఈ క్రమంలో ఉగ్రవాద దాడులు చేయడానికి యువ ముస్లింలను ప్రేరేపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అరెస్టు సమయంలో వారి వద్ద మొత్తం నాలుగు మొబైల్ ఫోన్‌లతో పాటు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను విచారించడంతో ఈ జంట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, మరియు టెలిగ్రామ్ వంటి అనేక అనామక ఐడిలను సృష్టించినట్లు కనుగొన్నారు.

ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిసిపి ప్రమోద్ కుష్వాహా మాట్లాడుతూ, "జామియా నగర్-ఓఖ్లా ప్రాంతానికి చెందిన స్పెషల్ సెల్ బృందం ఈ జంటను అరెస్టు చేసింది. వారి ఇంటిపై దాడి జరిగింది. మేము ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన సమాచారం మరియు వారి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నాము.. వారికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్‌తో సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ బాగా చదువుకున్న కాశ్మీర్ నివాసితులు. ఇద్దరూ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నారు. భర్త వెబ్ డిజైన్‌లో ఉద్యోగం చేశారు..

ఐఎస్ మ్యాగజైన్ కోసం అతని భార్య పలు కధనాలు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ జంట గత ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్నారు.. కాశ్మీర్ లాక్డౌన్ అయిన తరువాత ఢిల్లీకి వచ్చారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. వారి ల్యాప్‌టాప్‌లు మరియు మొబైల్ ఫోన్‌లను కూడా మేము స్వాధీనం చేసుకున్నాము.. అని ఆయన తెలిపారు. మరోవైపు పోలీసులు (స్పెషల్ సెల్) వారిపై భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 120 (బి), 124 ఎ, 153 ఎ కింద చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, 1967 లోని సంబంధిత విభాగాలతో పాటు పలు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories