breaking news : అర్థరాత్రి విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ

breaking news : అర్థరాత్రి విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ
x
Highlights

ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌...

ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్లపై అర్థరాత్రి విచారణ జరిపి, సత్వర ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ మురళీధర్‌ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జస్టిస్ మురళీధర్ పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

సుప్రీంకోర్టు కొలీజియం - భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ బొబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టులోని ముగ్గురు అత్యున్నత న్యాయమూర్తుల ప్యానెల్ - ఫిబ్రవరి 12 న జస్టిస్ మురళీధర్ బదిలీకి సిఫారసు చేసింది. సిఫారసుపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ స్పందించింది.. ఈ క్రమంలో ఈ సిఫారసును ఖండించింది. అంతేకాదు ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 20 న హైకోర్టు న్యాయవాదులు ఒక రోజు పనికి దూరంగా ఉండి నిరసన తెలిపారు. వాస్తవానికి ఫిబ్రవరి 12 న జరిగిన సమావేశంలో కొలీజియం సిఫారసు చేయాలని నిర్ణయించినా, ఫిబ్రవరి 19 న దీనిని బహిరంగపరిచింది.

కాగా జస్టిస్ మురళీధర్‌ ఈశాన్య ఢిల్లీలోని స్థానిక ఆసుపత్రిలో చిక్కుకున్న 22 మందిని రక్షించాలని.. ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం సంచలనంగా మారింది.

ఇదిలావుంటే జస్టిస్ మురళీధర్ 1987 లో ఢిల్లీ కోర్టుకు రావడానికంటే ముందు 1984 లో చెన్నైలో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. మే 2006 లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో, జస్టిస్ మురళీధర్ సున్నితమైన విషయాలలో కీలకమైన తీర్పులు ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories