Ramdev Baba: వివాదాల సుడిగుండంలో రాందేవ్ బాబా

Delhi High Court Summons Ramdev Baba
x

రామ్ దేవ్ బాబా (ఫైల్ ఇమేజ్)

Highlights

Ramdev Baba: అల్లోపతి వైద్యం, కరోనా టీకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

Ramdev Baba: రూపాయి అయినా పాపం పాపమే. తప్పు ఒప్పించడానికి రాందేవ్ బాబాతో రూపాయి అయినా ఫైన్ కట్టించాలని వైద్యలు పట్టుపడుతున్నారు. అల్లోపతి వైద్యం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా క్షమించమని అడిగినా క్షమించేది లేదు అని అంటున్నారు అల్లోపతి వైద్యులు. అల్లోపతి వైద్యం, కరోనా టీకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది.

అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ వైద్యుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడితో ఆగక పతంజలి అభివృద్ధి చేసిన కొరోనిల్ కిట్‌‌తో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. విచారించిన న్యాయస్థానం రాందేవ్ బాబాకు నిన్న సమన్లు జారీ చేసింది. సమన్లకు మూడు వారాల్లోగా స్పందనను దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, మున్ముందు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని రాందేవ్ బాబాకు చెప్పాలని ఆయన తరపు న్యాయవాదికి సూచించింది.

కాగా, రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వైద్యుల సంఘం.. ఆయన నుంచి నామమాత్రపు పరిహారంగా రూపాయి ఇప్పించాలని కోరింది. మరోవైపు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణ జోన్ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జె.గీతారెడ్డి కేంద్రమంత్రులు హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్‌లకు లేఖ రాస్తూ.. అల్లోపతి వైద్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని చెడగొట్టేలా రాందేవ్ బాబా, పతంజలి చైర్మన్ బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories