ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని పిల్.. కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని పిల్.. కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
x
Highlights

ఖైదీలకు ఓటు హక్కు కోరుతూ దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటు సదుపాయం చట్టం ద్వారా ప్రకారం కల్పించబడిందని, దీనిని చట్టం...

ఖైదీలకు ఓటు హక్కు కోరుతూ దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటు సదుపాయం చట్టం ద్వారా ప్రకారం కల్పించబడిందని, దీనిని చట్టం ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం ఈ పిల్ ను కొట్టేసింది. ఈ సందర్బంగా పౌరునికి ఓటు ప్రాథమిక హక్కు అని సాధారణ చట్ట హక్కు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ఒక శాసనం ద్వారా మాత్రమే అందించబడిందని పేర్కొంది.

ప్రజల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఓటు హక్కు చట్టం విధించిన ఆంక్షలకు లోబడి ఉందని, అయితే ఖైదీలను జైళ్ల నుండి ఓటు వేయడానికి అనుమతించదని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పులు మరియు చట్టబద్ధమైన నిర్ణయాల దృష్ట్యా హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. కాగా దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న వారందరికీ ఓటు హక్కును కోరుతూ ముగ్గురు న్యాయ విద్యార్థులు ప్రవీణ్ కుమార్ చౌదరి, అతుల్ కుమార్ దుబే, ప్రేర్నా సింగ్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories