ఎట్టకేలకు ఢిల్లీలో సాధారణ పరిస్థితి

ఎట్టకేలకు ఢిల్లీలో సాధారణ పరిస్థితి
x
Highlights

ఢిల్లీలో ఎట్టకేలకు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. గత 36 గంటల్లో అల్లర్లకు గురైన ఈశాన్య ఢిల్లీలో హింస సంఘటనలు జరగలేదని హోం మంత్రిత్వ శాఖ గురువారం...

ఢిల్లీలో ఎట్టకేలకు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. గత 36 గంటల్లో అల్లర్లకు గురైన ఈశాన్య ఢిల్లీలో హింస సంఘటనలు జరగలేదని హోం మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి ధృవీకరించింది. పరిస్థితుల మెరుగుదల దృష్ట్యా సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద విధించిన నిషేధ ఉత్తర్వులను శుక్రవారం 10 గంటలకు సడలించనున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి రావడంతో ఫిబ్రవరి 24 నుండి ఈశాన్య జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 7,000 కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించారు. అయితే గురువారం, హింస సంఘటనలు ఏవీ నివేదించబడలేదు. కాగా పరిస్థితిని సమీక్షించడానికి అలాగే ఎదుర్కొనేందుకు ముగ్గురు స్పెషల్ సిపిలు, ఆరుగురు జాయింట్ సిపిలు, ఒక అదనపు సిపి, 22 మంది డిసిపిలు , 20 మంది ఎసిపిలు, 60 మంది ఇన్స్పెక్టర్లు, 1,200 ఇతర ర్యాంకుల వారు మరియు 200 మంది లేడీ పోలీసులను ఈశాన్య ఢిల్లీ పోలీసు కమిషనరేట్ పరిధిలో నియమించారు.

ఎటువంటి పుకార్లకు ప్రాధాన్యం ఇవ్వవద్దని హోం మంత్రిత్వ శాఖ ప్రజలను అభ్యర్థించింది. అల్లర్లతో బాధపడుతున్న ప్రాంతాల్లో సహాయం అవసరమైన వారికి హెల్ప్‌లైన్లను - 22829334 , 22829335 ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌లైన్లకు ఇప్పటికే తగిన ప్రచారం కూడా ఇచ్చారు.. వీటిద్వారా ఎవరైనా దురాక్రమణదారుల గురించి మరియు ఏదైనా ఆందోళన పరిస్థితుల గురించి పోలీసులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే క్షతగాత్రులకు వైద్య సహాయం కోసం తగిన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు సమాజంలోని వివిధ వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా, పరిస్థితిని సాధారణీకరించడానికి మరియు సామరస్యాన్ని మెరుగుపరిచేందుకు ఢిల్లీ పోలీసులు శాంతి కమిటీ సమావేశాలను నిర్వహించడం ప్రారంభించారు.

పరిస్థితి సాధారణమయ్యే వరకు ఇటువంటి శాంతి కమిటీ సమావేశాలు కొనసాగుతాయని హోమ్ శాఖ తెలిపింది. గత రెండు రోజుల్లో ఢిల్లీ లోని వివిధ జిల్లాల్లో దాదాపు 330 శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించామని ఇప్పటివరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇవే కాకుండా, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్‌డబ్ల్యుఎ), మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఎమ్‌డబ్ల్యుఎ) లతో కూడా అనేక ప్రాంతాల్లో సమావేశం నిర్వహించారు. ఇటువంటి సమావేశాలకు పౌర సమాజ సమూహాలతో సహా సమాజంలోని వివిధ వర్గాలు, కాంగ్రెస్, ఆప్, బిజెపి తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేశారు. కాగా ఈశాన్య ఢిల్లీలోని ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజులకు పైగా ఘోరమైన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య గురువారం 38 కి చేరుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories