Delhi Gun Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్లకు పైగా కాల్పులు

Delhi Gun Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్లకు పైగా కాల్పులు
x

Delhi Gun Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్లకు పైగా కాల్పులు

Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పార్కింగ్‌లో ఉన్న కారుపై 12 రౌండ్లకు పైగా కాల్పులు జరగగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Delhi Gun Firing: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని రోహిణి ప్రాంతంలో పార్కింగ్‌లో ఉన్న ఓ కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అక్కడి నుంచి డజన్ల కొద్దీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతర్జాతీయ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి తనను పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

డబ్బులు ఇవ్వనందుకే బెదిరింపులలో భాగంగా ఈ కాల్పులు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఎర్రకోట ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తాజా ఘటనతో ఎలాంటి ఉగ్రకోణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో రాజధానిలో భద్రతను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories