Delhi Exit Polls: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్... ఒక్క పార్టీకే పట్టం కట్టిన సర్వేలు.. ఏ పార్టీ అంటే..

Delhi Exit Polls: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్... ఒక్క పార్టీకే పట్టం కట్టిన సర్వేలు.. ఏ పార్టీ అంటే..
x
Highlights

Delhi Exit Polls news live updates Delhi Exit Polls: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. అత్యధిక సర్వేలు ఈసారి ఎన్నికల్లో ఓటర్లు బీజేపికే అధికారం...

Delhi Exit Polls news live updates

Delhi Exit Polls: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. అత్యధిక సర్వేలు ఈసారి ఎన్నికల్లో ఓటర్లు బీజేపికే అధికారం అప్పగించనున్నట్లు ప్రకటించాయి. రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ 0 నుండి 2 లేదా 3 కు మించి ఎక్కువ ఇవ్వలేదు. ఏయే ఎగ్జిట్ పోల్స్, ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయని వెల్లడించాయంటే....

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ సోర్స్

ఆమ్ ఆద్మీ పార్టీబీజేపికాంగ్రెస్
చాణక్య స్ట్రాటెజీస్25-2839-442
జేవీసీ

2-31

39-450-2
ABP మ్యాట్రీజ్32-3735-400-1
Republic P-Mark21-3139-490-1
పీపుల్స్ ఇన్‌సైట్25-2940-440-2
పీపుల్స్ పల్స్10-1951-600
పోల్ డైరీ18-2542-500-2
డీవీ రిసెర్చ్26-3436-440
వీ ప్రిసైడ్46-5218-230-1

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారం సొంతం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా 36 స్థానాలు రావాలి. అది ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్.

వీ ప్రిసైడ్ అనే సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి 46 నుండి 52 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కేకే సర్వే ఫలితాలు కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపే కనిపించాయి. అలా ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మినహాయిస్తే.. మెజారిటీ సర్వేలు బీజేపికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలన్న కల తీరనట్లే. దేశంతో పాటు దేశ రాజధానిలో కూడా అధికారం చేజిక్కించుకోవాలన్న బీజేపి ప్రయత్నం నేరవేరుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మూడో స్థానం అని చెప్పడం కంటే అసలు ఓటర్లు ఆ పార్టీని పరిగనణలోకి తీసుకున్నట్లే కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఢిల్లీ ఎగ్డిట్ పోల్స్ ఫలితాలు Vs ఢిల్లీ ఎన్నికల ఫలితాలు

అయితే, ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం వివిధ సంస్థలు చేసే సర్వేల ఫలితాలు మాత్రమే కానీ ఓటర్లు ఇచ్చే కచ్చితమైన తీర్పు కాదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, ఎన్నికల ఫలితాలక మధ్య కొన్నిసార్లు చిన్న తేడా మాత్రమే ఉంటుంది. అంటే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు కాస్త అటుఇటు తేడాతో ఎన్నికల ఫలితాలు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటాయి. ఈసారి ఏం జరుగుతుందనేది తెలియాలంటే ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories