Delhi Polls Results 2025: ఢిల్లీలో ఆప్ ఓటమి... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫన్నీ మీమ్స్

Delhi Election Results 2025 Memes going viral about BJP victory, AAP and Arvind Kejriwal defeat in Delhi assembly elections 2025
x

ఢిల్లీలో ఆప్ ఓటమి... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెడీ మీమ్స్ 

Highlights

Funny Memes on Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపి విజయం సాధించింది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్...

Funny Memes on Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపి విజయం సాధించింది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుదామనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఇక చెప్పనక్కరే లేదు. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మెజారిటీ సర్వేలు చెప్పినట్లుగానే ఆ పార్టీ ఇంకా ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాల సరళిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఇప్పటికే బోలెడన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి నెటిజెన్స్ వేస్తోన్న సైటైర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి ఆ పార్టీ ప్రత్యర్థులు ఫన్నీగా రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఈ మీమ్స్‌ను ప్రజెంట్ చేస్తున్నారు. అందులో మచ్చుకు కొన్ని మీమ్స్‌పై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.

ఓటమి బాధలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండి ఉంటుందని చెబుతూ విరాట్ కోహ్లీ కన్నీళ్లు తుడుచుకుంటున్న పాత ఫోటోను పెట్టి ట్రోల్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు ఒక్క సీట్ కూడా రాకపోవడంతో నెటిజెన్స్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తున్నారు. పెట్రోల్ బంకులో వాహనాల్లో పెట్రోల్ నింపే ముందు "జీరో ఉంది చూడండి" అని అక్కడి సిబ్బంది కస్టమర్స్‌కు చెబుతుంటారు. సరిగ్గా అలాంటి ఫోటోలో రాహుల్ గాంధీని చూపిస్తూ మీ పార్టీకి కూడా జీరోనే ఉందని మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి బాధను గతంలో ఒక నేత ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోతో పోల్చి చూపిస్తున్నారు.

గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగి ఆ తరువాత పార్టీకి ఎదురుతిరిగిన స్వాతి మలివాల్‌ను కూడా నెటిజెన్స్ విడిచిపెట్టలేదు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓడిపోవడం స్వాతికి గుడ్ న్యూస్ తరహాలో ఉంటుందనే అర్థం వచ్చేలా ఆమె పేరుతో కూడా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఢిల్లీ ఓటర్లు బీజేపిని గెలిపించి, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించిన తీరును స్విమ్మింగ్‌పూల్‌లో ఓ మహిళతో పోలుస్తూ ఇంకొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ఓటర్లను మహిళగా పోలుస్తూ ఆమె ఓవైపు బీజేపిని బతికించి, ఆమ్ ఆద్మీ పార్టీని నీళ్లలోనే వదిలేసినట్లు అందులో ఉంటుంది. ఆప్ మునిగిపోతున్నట్లుగా అందులో చూపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అప్పటికే మునిగిపోయి నీళ్ల కింద ఉన్నట్లుగా ప్రజెంట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories