Delhi Election Results 2025 : ఢిల్లీ ప్రభుత్వ ఉచిత పథకాలు.. నెలకు ఎంత ఆదా అవుతుందో తెలుసా ?

Delhi Election Results 2025  How Much Can Common People Save with Free Schemes?
x

Delhi Election Result : ఢిల్లీ ప్రభుత్వ ఉచిత పథకాలు.. సాధారణ ప్రజలకు నెలకు ఎంత ఆదా అవుతుందో తెలుసా ? 

Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా వంటి పథకాలు ప్రజల్లో విస్తృత చర్చకు కారణమయ్యాయి.

Delhi Election Result : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా వంటి పథకాలు ప్రజల్లో విస్తృత చర్చకు కారణమయ్యాయి. 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ పథకాల భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ఈ సారి ప్రభుత్వం మారితే ఈ పథకాలు కొనసాగుతాయా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఉచిత విద్యుత్, నీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్, తీర్థయాత్ర పథకం వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే, ఈ పథకాల వల్ల ఒక సాధారణ కుటుంబానికి నెలకు ఎంత ఆదా అవుతుందో తెలుసుకుందాం.

ఉచిత విద్యుత్ ద్వారా ఆదా

ఢిల్లీలో ప్రస్తుతం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతోంది. 201-400 యూనిట్ల మధ్య వినియోగం ఉన్న వారికి 50శాతం సబ్సిడీ వర్తించనుంది. విద్యుత్ ఛార్జీల ప్రకారం, 200 యూనిట్ల వరకు ధర యూనిట్‌కు రూ. 3 కాగా, 500 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 4.50గా ఉంది.

* 200 యూనిట్ల విద్యుత్ ఖర్చు: సుమారు రూ. 600

* మీటర్ ఫిక్స్‌డ్ ఛార్జ్: రూ. 20

* ఇతర ఛార్జీలు కలిపి: సుమారు రూ. 800

* 400 యూనిట్ల విద్యుత్ ఖర్చు: రూ. 1,800

* మొత్తం బిల్లు: రూ. 2,100

* సబ్సిడీ అనంతరం ఖర్చు: రూ. 1,100 - 1,200

దీంతో కనీసం ఒక సాధారణ కుటుంబానికి నెలకు సుమారు రూ. 1,000 ఆదా అవుతోంది.

ఉచిత నీటి పథకం ద్వారా లాభం

ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 20,000 లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా కల్పిస్తోంది. సాధారణంగా, ఒక కుటుంబం రోజుకు 500-600 లీటర్ల నీటిని వినియోగించుకుంటుంది. దీని వల్ల ఎక్కువ మంది 20,000 లీటర్ల ఉచిత సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతున్నారు.

* 20,000 లీటర్ల వరకు నీటి ధర: 1,000 లీటర్లకు రూ. 5.27

* మీటర్ ఛార్జ్: రూ. 146.41

* సివేజ్ మెంటినెన్స్ ఛార్జ్: మొత్తం బిల్లుపై 60%

* మొత్తం ఖర్చు: సుమారు రూ. 350

ఐతే 20,000 లీటర్ల మించితే నీటి ఛార్జీలు పెరుగుతాయి.

* 30,000 లీటర్ల వరకు బిల్లు: సుమారు రూ. 990

* ఉచిత పథకం వల్ల ఆదా: సుమారు రూ. 500 నెలకు

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం

2019-20 నుంచి ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. సాధారణంగా, ఒక రోజు ప్రయాణ ఖర్చు రూ. 50 ఉండగా, ఒక మహిళ 25 రోజులు ప్రయాణిస్తే రూ. 1,250 ఆదా అవుతుంది.

మొత్తం ఆదా ఎంత?

1. విద్యుత్ ఆదా: రూ.1,000

2. నీటి బిల్లు ఆదా: రూ.500

3. ఉచిత బస్సు ప్రయాణం: ₹1,250

మొత్తం నెలకు రూ. 2,500 వరకు ఆదా అవుతోంది.

ఇతర ఉచిత పథకాలు

ఉచిత విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, పుస్తకాలు, యూనిఫాం

ఉచిత ఆరోగ్య సేవలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు

తీర్థయాత్ర పథకం: వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర సౌకర్యం

పెన్షన్ పథకాలు: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక సహాయం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ. 2,100 భృతి అందించనున్నట్లు హామీ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ అయితే రూ. 2,500 వరకు ఇస్తామని ప్రకటించాయి.

కేజ్రీవాల్ ఉచిత పథకాలు ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవనం సాగించే అవకాశం కల్పించాయి. అయితే, ప్రభుత్వ మార్పు వచ్చినప్పుడు వీటిలో మార్పులు జరగనా? లేదా కొనసాగుతాయా? అనే అంశం ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories