Arvind Kejriwal: సోమనాథ్ ఆలయంలో కేజ్రీవాల్ ప్రత్యేక పూజలు

Delhi CM Arvind Kejriwal Visits Somnath Temple
x

Arvind Kejriwal: సోమనాథ్ ఆలయంలో కేజ్రీవాల్ ప్రత్యేక పూజలు

Highlights

Arvind Kejriwal: దేశంలో ఏకరీతి పన్ను విధానం సరికాదన్న కేజ్రీవాల్

Arvind Kejriwal: దేశంలో జీఎస్టీ వంటి ఏకరీతి పన్ను విధానం సరికాదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్. వ్యక్తిగతంగా తాను దానికి అనుకూలం కాదని స్పష్టం చేశారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సులభంగా పన్నులు చెల్లించేందుకు వీలుగా జీఎస్టీని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగు, గోధుమ పిండి, బియ్యం వంటి వాటిపై కేంద్రం జీఎస్టీ విధించిందని ఇప్పుడు గాలిపై కూడా జీఎస్టీ విధిస్తారేమోనని ఎద్దేవా చేశారు.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. అంతకుముందు కేజ్రీవాల్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయాన్ని దర్శించారు. సోమనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories