Arvind Kejriwal: తిహార్ జైలుకు కేజ్రీవాల్‌.. ‌ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధించిన కోర్టు

Delhi CM Arvind Kejriwal Taken To Tihar Jail
x

Arvind Kejriwal: తిహార్ జైలుకు కేజ్రీవాల్‌.. ‌ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధించిన కోర్టు

Highlights

Arvind Kejriwal: విచారణలో సమాధానాలు దాటవేశారు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్‌ స్కాంలో 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేయగా... వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. మార్చి 28న కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టులో హజరుపరిచారు. మరో మూడు రోజులపాటు కస్టడీ విధించింది. కోర్టు విధించిన ఈడీ కస్టడీ నేటితో ముగియగా.. అధికారులు ఆయన్ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. స్పెష‌ల్ జ‌డ్జి ముందు ఆయ‌న్ను ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories