ఢిల్లీ ఎన్నికలు : సీఎం కేజ్రీవాల్ నామినేషన్‌పై ఉత్కంఠ

ఢిల్లీ ఎన్నికలు : సీఎం కేజ్రీవాల్ నామినేషన్‌పై ఉత్కంఠ
x
Kejriwal File Photo
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార ప్రతిపక్షల మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార ప్రతిపక్షల మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మధ్య ట్విటర్ వేదికగా వార్ నడుస్తోంది.

కాగా.. అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలుపై ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారం నామినేషన్‌ దాఖలు చేయాలని చూస్తే రోడ్ షో కారణంగా వాయిదా పడింది. కేజ్రీవాల్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయడానికి జామ్‌నగర్ హౌస్‌లోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. అక్కడ 50 మంది స్వతంత్ర అభ్యర్థులు క్యూలో ఉన్నారు. దీంతో చివరి రోజు కావడంతో కేజ్రీవాల్ నామినేషన్ పై ఉఠ్కంట మొదలైంది. అయితే నామినేషన్‌ దాఖలు చేసేందుకు సీఎం క్యూలో ఉన్నారని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు.

మరోవైపు ట్విటర్ వేదికగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. సీఎం కేజ్రీవాల్ వేసి ట్వీట్ చేశారు. ఓవైసు బీజేపీ, కాంగ్రె, ఆర్జేడీ, ఎల్ జేపీ, జేడియూ.. పార్టీలు ఉంటే మరోవైపు, విద్యా, వైద్యం, నీరు విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఢిల్లీ ప్రజలు ఉన్నారని అంటే అభివృద్ధి, సంక్షేమం ఉందంటూనే.. ప్రతిపక్షాల లక్ష్యం నన్ను ఓడించడం అయితే నా లక్ష్యం ఢిల్లీని అభివృద్ధి చేయడం, అవినీతి నిర్మలించడం అని కేజ్రీవాల్ ట్విట్ చేశారు.

కేజ్రీవాల్ ట్వీట్ పై బీజేపీ ఎంపీ ఢిల్లీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విమర్శలు ఎక్కుపెట్టారు. ఓవైపు, అస్థవ్యస్థమైన రవాణా, కలుషిత నీరు, కాలుష్యం, ఐదేళ్లలో కొత్త ఆస్పత్రి లేదు, ఎక్ట్రానింక్ బస్సు లేదు ట్విట్ చేశారు. అంతే కాకుండా అవినీతి లేదని చెప్పుకుంటున్న సీఎం అవినీతి గురించి ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి పంపించారని ఎదేవా చేశారు. పాలనలో ఆప్ విఫలైమైంది. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ తో చేతులు కలిపిన సంగతి మరిచిపోయారా అని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ను వ్యతిరేకిస్తున్నారని, బీజేపీతో కలిసి ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories