ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయింది. ఢిల్లీ లోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయింది. ఢిల్లీ లోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఢిల్లీ వ్యాప్తంగా 13,750 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 1.47 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. కరోల్ బాగ్‌లోని జందెవాలన్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి బిజెపి నేత రామ్ మాధవ్ వచ్చారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు తమ పిల్లలకు మెరుగైన విద్య మరియు భవిష్యత్తు కోసం ఓటు వేస్తారు" అని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. కాగా 70 స్థానాలకు గాను 672 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటిసారిగా, 2 లక్షలకు పైగా 80+ మరియు 50,000 మంది వికలాంగ ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాలను ఈసీ చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో 5 వేల మంది ఢిల్లీ పోలీసుల తోపాటు 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌, పారా మిలటరీ దళాల తో బందోబస్తు ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్‌బాగ్‌లో నిరసనలు, జేఎన్‌యూలో హింస వంటి ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఢిల్లీలో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జామియా ప్రాంతంలో శనివారం తెల్లవారుజాము నుంచి వాహనాలను భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి పంపిస్తున్నారు. జామియా విశ్వవిద్యాలయం గేట్ నంబర్ 7 వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఇస్లామియా విద్యార్థులను ఎన్నికల నేపథ్యంలో క్యాంపస్‌లోని గేట్ 4 కి తరలించారు. గురువారం తీసుకున్న నిర్ణయం ప్రకారం, పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్ల పరిధిలో ఉన్నందున నిరసన స్థలాన్ని గేట్ నంబర్ 4 కి మార్చాలని ఉమ్మడి సమన్వయ కమిటీ (జెసిసి) జామియా నిర్ణయించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories