రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
x
Highlights

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ముక్కోణ పోరు నెలకొంది.

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ముక్కోణ పోరు నెలకొంది. పలు పార్టీల నుంచి దాదాపు 668 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికల కోసం 13,750 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.

ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గెలుపుకోసం 240 మంది ఎంపీలు, 59 మంది కేంద్ర మంత్రులు, 11 రాష్ట్రాల సీఎంలు, వెయ్యి మంది బీజేపీ కార్యకర్తలు గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. అటు, కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్లు ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీపార్టీ నుంచి కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ తోపాటు పలువురు పార్టీ నేతలు క్యాంపెయిన్ చేశారు. ప్రధానంగా తాము ప్రవేశపెట్టిన పథకాలే తమకు విజయాన్నిస్తాయని కేజ్రీవాల్ టీం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కాగా ఈనెల 11న ఫలితాలు వెలువడనున్నాయి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories