మందకొడిగా పోలింగ్.. మరికాసేపట్లో పెళ్లి అనగా ఓటు వేయడానికి వచ్చిన పెళ్ళికొడుకు

మందకొడిగా పోలింగ్.. మరికాసేపట్లో పెళ్లి అనగా ఓటు వేయడానికి వచ్చిన పెళ్ళికొడుకు
x
Highlights

జాతీయ రాజధాని ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2గంటల వరకూ కూడా 28 శాతమే నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

జాతీయ రాజధాని ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2గంటల వరకూ కూడా 28 శాతమే నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఒంటిగంటలోపు 19.37 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. 12 గంటల సమయానికి 15.57 శాతం నమోదయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే 2 గంటల తరువాత మాత్రం కాస్త ఊపందుకుంది. ఇలాగే కొనసాగితే 50 శాతం దాటే అవకాలున్నాయని అంటున్నారు. ఏ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లక్ష్మీనగర్‌ నియోజకవర్గంలోని శాఖర్పూర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి పెళ్ళికొడుకు వచ్చారు.. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. ఓటు వేసి మరీ వెళ్ళాడు.

మరోవైపు పోలింగ్ సరళి ప్రశాంతంగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ 40,000 మంది సిబ్బందిని నియమించారు. అలాగే 19,000 మంది హోమ్ గార్డ్లను , 190 పారామిలిటరీ దళాలను ఢిల్లీ అంతటా నియమించారు. స్వచ్ఛంద సేవకుల సహాయంతో షాహీన్ బాగ్ వంటి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిరసన ప్రదేశాలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం, సౌత్ ఈస్ట్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎస్‌హెచ్‌ఓలు షాహీన్ బాగ్ పరిశిస్థితిని సమీక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories