గుజరాత్ బుజ్ లో ఓ విద్యాసంస్థ నిర్వాకం

గుజరాత్ బుజ్ లో ఓ విద్యాసంస్థ నిర్వాకం
x
Highlights

రాకెట్ యుగంలోనూ రాతియుగం సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. గుజరాత్ లోని ఓ కళాశాల యాజమాన్యం అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. గుజరాత్ బుజ్ ప్రాంతంలోని...

రాకెట్ యుగంలోనూ రాతియుగం సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. గుజరాత్ లోని ఓ కళాశాల యాజమాన్యం అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. గుజరాత్ బుజ్ ప్రాంతంలోని సహజానంద గర్ల్స్ ఇనిస్టిట్యూట్ లో నెలసరి సమయంలో విద్యార్ధులు కిచెన్ లోకి వచ్చారంటూ ఆగ్రహించిన యాజమాన్యం వారిలో ఎవరెవరు నెలసరిలో ఉన్నారో చూడాలంటూ లో దుస్తులు తొలగించాలని ఆదేశించింది. దాదాపు 68 మంది విద్యార్ధినులను వరుసలో నిలబెట్టి వారి లో దుస్తులు విప్పి చెక్ చేయించింది. 1500 మంది ఆడపిల్లలున్న ఈ విద్యాసంస్థలో ఆచారాలు, నియమాలు, సంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తారు. నెలసరి సమయంలో విద్యార్ధినులు ఆలయంలోకి, కిచెన్ లోకి రాకూడదు. కానీ కొందరు వచ్చారన్న అనుమానం రావడంతో ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడి గట్టారు. ప్రిన్సిపాల్ పై మండిపడిన జాతీయ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories