డీఆర్డీవో బ్రహ్మోస్ తయారీ ల్యాబ్‌కు రాజ్‌నాథ్ శంకుస్థాపన..

Defense Minister Rajnath Singh Start the BrahMos Missile Unit and DRDO Lab In Lucknow
x

డీఆర్డీవో బ్రహ్మోస్ తయారీ ల్యాబ్‌కు రాజ్‌నాథ్ శంకుస్థాపన

Highlights

Rajnath Singh: ఎవరైనా మనపై కన్నెత్తి చూస్తే, మన దేశంలోనే కాకుండా.. సరిహద్దులను దాటుకుని వెళ్ళి మరీ తగిన బుద్ధి చెప్పగలం

Rajnath Singh: భారత్‌పై కన్నెత్తి చూసే సాహసం చేయడానికి ఇతర దేశాలకు అవకాశం లేకుండా అత్యంత సమర్ధవంతమైన బ్రహ్మోస్ మిస్సైళ్లను తయారు చేస్తున్నామన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. యూపీ లక్నోలో డీఆర్డీవో బ్రహ్మోస్ మిస్సైల్స్ తయారీ ల్యాబ్‌ను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశంగించిన రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను తిప్పికొట్టగలిగే సామర్థ్యం మనకు అవసరమని, అందుకే బ్రహ్మోస్ క్షిపణులు, తదితర ఆయుధాలను భారత్ తయారు చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలపై దాడి చేయాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం లేదని తెలిపారు. శత్రుత్వ భావంతో ఏ దేశమైనా మనపై దాడి చేస్తే, దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం వీటిని తయారు చేస్తున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories