ఏమైనా చేయండి.. సాయుధ దళాలకు పూర్తీ స్వేచ్చ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్!

ఏమైనా చేయండి.. సాయుధ దళాలకు పూర్తీ స్వేచ్చ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్!
x
Rajnath Singh (File Photo)
Highlights

ఇటీవల గాల్వన్ లో చైనా, భారత్ ల మధ్య హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవల గాల్వన్ లో చైనా, భారత్ ల మధ్య హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లడఖ్‌లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పసిగట్టాలని, వారి ప్రతి కదలికను నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. సరిహద్దులో చైనా సైనికులు ఎటువంటి దుశ్చర్యలకు ప్రయత్నించినా దీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు.

ఈ విషయంలో సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు రక్షణ శాఖ ఆదేశాలు జారీచేసింది ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో చైనా సైనికులు ఎలాంటి సాహసం చేసినా తిప్పికొట్టడానికి భారత దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గాల్వన్ లోయలో ఎప్పటికప్పుడు పరిస్థితిని భద్రతా దళాలు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. మరోవైపు గాల్వన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 ప్రాంతంలో భారత సైన్యం పట్టు సాధించింది. ఇదిలావుంటే రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్‌ కు హాజరు కావడానికి మంత్రి రాజ్‌నాథ్ సోమవారం బయలుదేరి వెళతారు. అక్కడ జూన్ 24న జరిగే పరేడ్‌ లో పాల్గొంటారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories