భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు

Corona Cases: తాజాగా 58,077 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 657 మంది మృతి.

Sriveni Erugu
Published on: 11 Feb 2022 10:09 AM IST
Decreasing corona cases in India
X

భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు

Corona Cases: భారత్ లో కొత్తగా 58వేల, 77 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4 కోట్ల, 25లక్షల, 36వేల, 137కు చేరాయి. ఇందులో 4 కోట్ల,13 లక్షల,31వేల,158 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. మరో 6 లక్షల, 97వేల, 802 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5 లక్షల,7వేల, 177 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో లక్షా, 50వేల, 407 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 657 మంది మరణించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు తగ్గడంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య అధికమవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గిందని, రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని తెలిపింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story