ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు 35 మంది మృతి

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు 35 మంది మృతి
x
Highlights

పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 35 కి పెరిగింది.

పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 35 కి పెరిగింది. గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో 30, ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో రెండు, జగ్ పర్వేశ్ చంద్ర ఆసుపత్రిలో ఒకరు మరణించినట్లు జిటిబి ఆసుపత్రి అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన ఘర్షణల్లో ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 27 ఉండగా.. తాజాగా అది అది 35 కు పెరిగింది.

జిటిబి వద్ద మరణించిన వారి వివరాలను ఆసుపత్రి అధికారులు బుధవారం వెల్లడించారు.. ఇక్కడ తొమ్మిది మందికి తుపాకీ గాయాలు ఆయాయ్యి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. జిటిబి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. మృతుల్లో చాలా మందిని గుర్తించామని.. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. రోగుల్లో చాలా మందికి తుపాకీ కాల్పులు, రాళ్ళు మరియు ఇతర ఆయుధాల గాయాలు ఉన్నాయి.. అల్లర్ల నుండి తప్పించుకునే క్రమంలో చాలా మంది పైకప్పుల నుండి దూకి గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories