పాన్-ఆధార్ అనుసంధానానికి గడుపు పొడిగింపు

పాన్-ఆధార్ అనుసంధానానికి గడుపు పొడిగింపు
x
Highlights

పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ గడువును పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది.

పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ గడువును పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు పెంచుతున్నట్లు పొడిగించినట్లు తెలిపింది. డిసెంబర్‌ 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజా గడువు పెంచుతున్నట్లు పేర్కొంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది.

వాస్తవానికి అక్కడ ఒక ప్రవాస భారతీయుడికి (ఎన్‌ఆర్‌ఐ) ఆధార్ కార్డు లేదా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అవసరం లేదు, కానీ వాటిని మార్చి 31 లోగా లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్నారై పాన్ కార్డు మరియు ఆధార్ రెండింటినీ కలిగి ఉండాలని సూచించారు.

అనుసంధానానికి గడువు మార్చి 31 వరకు పొడిగించబడింది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎన్నారైలకు భారతదేశంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే లేదా దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పాన్ కార్డు తప్పనిసరి గా ఉండాలి. కాగా ఆదాయ పన్ను వెబ్‌సైట్‌లో ఆధార్‌, పాన్‌ అనుసంధానం లింక్‌పై క్లిక్‌ చేసి.. ఆ రెండింటి వివరాలు ఇవ్వాల్సి నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఈ మార్చి నెలాఖరులోపు రెండింటినీ జతచేయడం చేయకపోతే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏఏ ప్రకారం పాన్‌ కార్డును రద్దు చేస్తారు.

పాన్‌తో ఆధార్‌ లింక్‌కు గతంలో చాలా సార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం ఈసారి డిసెంబర్‌ 31 తరువాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ విషయాన్నీ గమనించాలని పేర్కొంది. మరోవైపు భారతీయ ప్రవాసులు, గమనించండి. ఈ సంవత్సరం చివరి నాటికి మీరు మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయనిదిగా పరిగణించబడుతుందిని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories