Uttar Pradesh: డెడ్ బాడీని చెత్త బండిలో తరలింపు

Uttar Pradesh: డెడ్ బాడీని చెత్త బండిలో తరలింపు
x
Highlights

కరోనా విలయం ఏ దారికి తెస్తుందో అర్థం కావడం లేదు... ఒక పక్క ఈ రోగంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తుండటంతో గుట్టలు, గుట్టలుగా మృతదేహాలను వేసి...

కరోనా విలయం ఏ దారికి తెస్తుందో అర్థం కావడం లేదు... ఒక పక్క ఈ రోగంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తుండటంతో గుట్టలు, గుట్టలుగా మృతదేహాలను వేసి పూడ్చేస్తున్నారు. మరో పక్క తాజాగా సాధారణ వ్యాధితో చనిపోయిన వ్యక్తిని సైతం కరోనాగా భావించి, అంబులెన్స్ సిబ్బంది వెనుకడుగు వేయడంతో చేసేది లేక చెత్త వ్యాన్లో తరలించారు. ఇది వైరల్ కావడంతో చివరకు భాద్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ లో దారణం జరిగింది. చనిపోయిన వ్యక్తిని అధికారులు తరలించిన తీరును అందరిని కలచివేసింది. దీంతో విమర్శలు వెల్తువెత్తడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా భయంతో డెడ్ బాడీని మానవత్వం మరిచిపోయి చెత్త వ్యాన్ లో తరలించిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్​ లోని బలరామ్ పూర్ లో జరిగింది. డెడ్ బాడీని చెత్త వ్యాన్ లో వేసుకుని పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు వర్కర్లు, నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.

లక్నోకు 160 కిలో మీటర్ల దూరంలోని బలరామ్ పూర్ కు చెందిన మహ్మద్ అన్వర్.. పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఉన్నటుండీ ఆఫీసు ముందే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది డెడ్ బాడీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా భయంతో అక్కడే ఉన్న అంబులెన్స్ సిబ్బంది అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. హడావిడిగా ఆ డెడ్ బాడీని చెత్తను పడేసినట్లుగా.. మున్సిపల్ గార్బేజ్ వ్యాన్ లో వేసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు ముందుండి మరీ చెత్త వ్యాన్ లో డెడ్ బాడీని తరలించడం వీడియోల్లో వైరల్ గా మారింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. డెడ్ బాడీని అలా నిర్లక్ష్యంగా తరలించడం దారుణమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ అతడు కరోనాతో చనిపోయినా, పీపీఈ కిట్ వేసి, గౌరవంగా డెడ్ బాడీని తరలించి ఉండాల్సిందన్నారు. దీనిపై శాఖాపరమైన చర్యలు ఆదేశించినట్లు బలరామ్ పూర్ జిల్లా ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories