పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌పై కూతురు సంచలన ఆరోపణ

Daughter sensational accusation against Punjab CM Bhagwant Mann
x

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌పై కూతురు సంచలన ఆరోపణ

Highlights

Seerat: సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ వీడియో విడుదల చేసిన సీరత్

Seerat: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఆయన మొదటి భార్య కూతురు సీరత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మద్యం తాగి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసే అలవాటు ఉందని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఆ ఇప్పుడు వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు భగవంత్ మాన్‌పై విమర్శలు చేస్తున్నాయి. తాను ఈ వీడియో చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని సీరత్ కౌర్ తెలిపారు. కథ బయటకు రావాలని మాత్రమే కోరుకుంటున్నాన్నారు. తాను, తన తల్లి చాలా కాలం మౌనంగా ఉన్నామని..తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని తెలిపారు. తాము మౌనంగా ఉన్నందుకే భగవంత్ మాన్‌ సీఎం స్థానంలో కూర్చున్నారన్నారు సీరత్.

మాన్ తన రెండో భార్య ద్వారా మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని తాము బయట వ్యక్తుల నుంచి తెలుసుకున్నామన్నారు సీరత్. తనను, తన సోదరుడిని పట్టించుకోని వ్యక్తి మూడో బిడ్డకు ఎందుకు జన్మనివ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక వ్యక్తి పిల్లల బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోతే, పంజాబ్‌ను నడిపించే బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారన్నారు. సీఎం మాన్ ను కలవడానికి తన సోదరుడు దోషన్ చేసిన ప్రయత్నాలను కూడా సీరత్ కౌర్ వీడియోలో వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories