నిసర్గా తుఫాను కారణంగా నలుగురు మృతి.. ఈరోజు భారీ వర్షాలు..!

నిసర్గా తుఫాను కారణంగా నలుగురు మృతి.. ఈరోజు భారీ వర్షాలు..!
x
Highlights

నిసర్గా తుఫాను బుధవారం మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను తాకిన సంగతి తెలిసిందే.

నిసర్గా తుఫాను బుధవారం మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను తాకిన సంగతి తెలిసిందే. 110 కిలోమీటర్ల వేగంతో మహారాష్ట్రను తాకిన తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 4 కి చేరుకుంది. ముంబై మరియు థానే, పాల్ఘర్ పరిసర ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదయింది. తుఫాను ధాటికి ఉత్తర తీరంలో ఇళ్ళు, చెట్లు కూలిపోయాయి.. దీంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) పునరుద్ధరణ ప్రయత్నాలు కొనసాగించింది.

మరోవైపు ముంబైలో దాదాపు 20 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించామని, మరో 30,000 మంది సొంతంగా సురక్షితమైన ప్రదేశాలకు తరలించారని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) తెలిపింది. ముంబైలో 117 చెట్లు పడిపోయాయని బీఎంసీ తెలిపింది. ముంబైలో ఇప్పటివరకు తొమ్మిది గోడలు లేదా ఇల్లు కూలిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. ఇదిలావుంటే తుఫాను ప్రభావంతో పాల్ఘర్, థానే, ముంబై, రాయ్‌గడ్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories