Cyber Alert: వాట్సాప్‌లో ఆ లింక్‌లు క్లిక్‌చేయొద్దు!

Dont Click Whats app Links
x

వాట్సప్ ఇమేజ్

Highlights

Cyber Alert: సైబర్ కేటుగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

Cyber Alert: సైబర్ కేటుగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిడిట్​ కార్డులు ఇస్తామని, క్యాష్​ బ్యాక్​ ఒచ్చిందనే నెపంతో సెల్ ఫోన్ కు మేసెజ్స్ చేస్తూ అమాయకులపై వలపన్నుతున్నారు. తాజాగా అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి వీడియో లైవ్‌ స్ట్రీమింగ్ ఉచితమంటూ లింక్‌లు అందరి మొబైల్స్ కి వస్తున్నాయి. చాలామంది వినియోగదారులు ఇది నిజమని నమ్మి ఆ లింక్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి లింక్ లు వస్తే అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయితే, మిమ్మల్ని ఆశ పెట్టే అలాంటి లింక్‌లపై అస్సలు క్లిక్‌ చేయొద్దు. ఇదో పెద్ద మోసమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ కేటుగాళ్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆశలు చూపుతూ మీ వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు ఇలాంటి హానికరమైన లింక్‌లను పెద్ద ఎత్తున వాట్సాప్‌ల్లో పంపిస్తున్నారు. తద్వారా మీ బ్యాంకింగ్‌ సమాచారాన్ని సైతం చోరీ చేయవచ్చని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్‌లలో URL/లింక్‌ల రూపంలో వచ్చే ఈ ఎస్ఎంఎస్ క్లిక్‌ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్‌ చేయకుండా ఉండటం ద్వారా ఈ గొలుసును ఛేదించవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని యాంటీ వైరస్‌ ఇంజెన్‌లు ఈ హానికరమైన లింక్‌లను గుర్తించి నిరోధించాయని పోలీసులు పేర్కొన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రెండు నెలల పాటు ఉచితంగా పొందొచ్చని, లైవ్‌ స్ట్రీమింగ్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి అంటూ వస్తోన్న సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చూశారుగా పోలీసులు ఎం చేబుతున్నారో.. మీరు కూడా ఇలాంటి లింకులు వస్తే వాటిని క్లిక్ చేయకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories