PM Modi: భాష, భక్తి, సంస్కృతి, క్రికెట్‌.. శ్రీలంక పర్యటనలో మోదీ ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్!

PM Modi
x

PM Modi: భాష, భక్తి, సంస్కృతి, క్రికెట్‌.. శ్రీలంక పర్యటనలో మోదీ ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్!

Highlights

PM Modi: రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదన్నారు.

PM Modi: శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఇచ్చిన విందులో పాల్గొని... భారత్-శ్రీలంక సంబంధాలను మనసుకు హత్తుకునేలా వివరించారు. రెండు దేశాల ప్రజల్ని కలిపే విషయాల్ని గుర్తుచేస్తూ, "కూరలు, వంటలు, క్రికెట్" అనే మూడు మాటలతో ఆ అనుబంధాన్ని చక్కగా వివరించారు.

ఇద్దరూ పక్కపక్కనే ఉండే దేశాలు కావడంతో... ఇన్నాళ్లుగా వాణిజ్యం, భాష, భక్తి, సంస్కృతి అన్నీ కలిసి మెలిసి పెరిగాయని మోదీ తెలిపారు. బోధ్‌గయ, అనురాధపురం, రామేశ్వరం, తిరుకోణేశ్వరం లాంటి బౌద్ధ, రామాయణ సంబంధిత పుణ్యతీర్థాలపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రదేశాలు ఇరు దేశాల మతసాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. శ్రీలంకని భారత మహాసముద్రపు ముత్యంగా అభివర్ణించిన మోదీ, అక్కడి ప్రజల నుంచి దక్కిన ఆదరణ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత శ్రీలంకను సందర్శించిన తొలి విదేశీ అధినేతగా మోదీ వెళ్లారు. ఇదే సమయంలో, అధ్యక్షుడు దిస్సానాయకే గతేడాది భారత్‌కు వచ్చారు. అంటే రెండూ దేశాలు రాజకీయంగా ఒకే దారిలో నడుస్తున్నాయన్న సంకేతాలు ఇవే.

ఈ పర్యటన సందర్భంగా రక్షణ, డిజిటల్ రంగం, ఆరోగ్యం, వాణిజ్యం, ఎనర్జీ వంటి విభాగాల్లో ఏడూ ఒప్పందాలు కుదిరాయి. చైనా ప్రభావం మధ్య సముద్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో... భారత్ తన పొరుగుదేశాలపై దృష్టి పెడుతున్నందుకు ఇది తార్కికమైన ముందడుగు. భారత్ ఎల్లప్పుడూ శ్రీలంక అభివృద్ధి ప్రయాణానికి తోడుగా ఉండబోతుందని, ఈ బంధం ఇంకా బలపడుతుందని మోదీ తన ప్రసంగం ద్వారా సంకేతాలు ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదని, అది చరిత్రతో పాటు, మతసాంప్రదాయాలతో కలిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories