సీఆర్పీఎఫ్‌ 81 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సీఆర్పీఎఫ్‌ 81 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
x
Highlights

దేశ భద్రత విషయంలో సీఆర్పీఎఫ్‌ది కీలక పాత్ర అని.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సీఆర్పీఎఫ్‌ 81 వ ఆవిర్భావ...

దేశ భద్రత విషయంలో సీఆర్పీఎఫ్‌ది కీలక పాత్ర అని.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సీఆర్పీఎఫ్‌ 81 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. దేశంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా.. లా అండ్ ఆర్డర్‌ కాపాడే క్రమంలో.. సీఆర్పీఎఫ్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌దే కీలక పాత్ర అని తెలిపారు. గతంలో మన పార్లమెంట్‌పై మిలిటెంట్ దాడి జరిగినప్పుడు.. సీఆర్పీఎఫ్ బలం ప్రపంచానికి తెలిసిందన్నారు. ప్రస్తుత బెటాలియన్లలో మహిళా బెటాలియన్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట.. ధర్నాలు చేసే వారిని చెదరగొట్టేందుకు ఎలా వ్యవహరించాలనే దానిపై సీఆర్పీఎఫ్‌ బలగాలు నిర్వహించిన మాక్‌ డ్రిల్‌.. ఆకట్టుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories