ఉత్తర ప్రదేశ్‌లో పెరిగిన కరోనా కేసులు.. మరోపక్క మిడతల భయం..

ఉత్తర ప్రదేశ్‌లో పెరిగిన కరోనా కేసులు.. మరోపక్క మిడతల భయం..
x
Representational Image
Highlights

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 190 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రోగుల సంఖ్య 7176 కి చేరుకుంది. వీరిలో 4215...

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 190 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రోగుల సంఖ్య 7176 కి చేరుకుంది. వీరిలో 4215 మంది రోగులు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం 2758 మంది రోగులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అలాగే కొత్తగా కరోనా కారణంగా 15 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా సంక్రమణతో మరణించిన వారి సంఖ్య 197 కి పెరిగింది. కాగా వారణాసి నుండి ముంబైకి వలస వచ్చిన ఇద్దరు వారిలో కరోనా నిర్ధారించబడింది.

దీంతో ఇద్దరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వారణాసి, బల్లియా, మౌ, ఘాజిపూర్, జౌన్‌పూర్, సోన్‌భద్ర, భడోహిలో మొత్తం సోకిన వారి సంఖ్య 639 కు చేరుకుంది. అదే సమయంలో రాష్ట్రంలో మిడతల భయం కూడా పట్టుకుంది. వాటిని తరిమికొట్టడానికి అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మిడతల భారీ నుంచి తప్పించుకోవడానికి ప్రజలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. కొందరు డ్రమ్స్ వాయించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories