దేశంలో 5వేలు దాటిన కోవిడ్19 మరణాలు

దేశంలో 5వేలు దాటిన కోవిడ్19 మరణాలు
x
Representational Image
Highlights

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 193మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143 చేరింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 89,995 గా ఉంది.

కరోనా కు చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారూ 86,984 కాగా..కరోనా బారిన పడి వల్ల దేశంలో మొత్తం 5164 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతుండగా మరణాల్లో మాత్రం 13వ స్థానంలో ఉంది. కొవిడ్‌-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో జర్మనీ 8వ స్థానంలో ఉంది. టర్కీ 10వ స్థానంలో కొనసాగుతుంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories