వచ్చే జూలై కల్లా 25 కోట్ల మందికి టీకాల పంపిణీకి ప్రణాళికలు!

వచ్చే జూలై కల్లా 25 కోట్ల మందికి టీకాల పంపిణీకి ప్రణాళికలు!
x
Highlights

COVID Vaccine : వచ్చే జూలై నాటికి దేశంలో 25 కోట్ల మందికి కరోనా వైరస్ టీకాలు అందించడానికి కేంద్ర పభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది

కరోనా వైరస్ కు టీకా త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఈమేరకు టీకా ఎప్పుడు సిద్ధం అయినా, వెంటనే దేశప్రజల్లో నాలుగో వంతు మందికి అందించడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా టీకాలు అందరికీ సమానంగా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అయన వివరించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం నిర్వహించిన సండే సంవాద్ లో అయన ఈ విషయాలు వెల్లడించారు. 'టీకాలకు సంబంధించి అన్ని రకాల అంశాలపై పరిశోధించడానికి ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఉంది. వచ్చే ఏడాది జులై కల్లా దాదాపు 400 నుంచి 500 మిలియన్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అవి దాదాపు 25 కోట్ల మందికి మనం సరఫరా చేయడానికి వీలవుతుంది' అని హర్షవర్దన్‌ వివరించారు.

ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ చేపట్టిన టీకాతొ పాటు, జైడస్‌ క్యాడిలా లిమిటెడ్‌కు చెందిన టీకా ఒకటి భారత్ లో సిద్ధం చేసేందుకు ముమ్మార ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైదాస్ క్యాడిలా టీకా రెండో దశ క్లినికల్ ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. అంతే కాకుండా అస్త్రజేనికా తొ కలిసి పూనే కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న టీకాపై మన దేశంలో రెండు, మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటె..గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75వేల కేసులు నమోదు కాగా 940 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా రికవరీల్లో 21శాతంతో భారత్‌ తొలి స్థానంలో ఉందని శనివారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 55లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 9లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories