Covid Vaccine: మరో మైలురాయిని టచ్ చేసిన భారత్.. 100 కోట్లకు చేరువలో..

Covid Vaccination Doses in India Expected to Cross 100 Crore Today 21 10 2021
x

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌(ఫైల్ ఫోటో)

Highlights

*రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది భారత్ *కరోనాను కంట్రోల్‌ చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతోంది భారత్. రికార్డు స్థాయిలో డోసులు వేసిన ఘనత సాధించింది. కరోనాను కంట్రోల్‌ చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందుకే టీకాలు వేయడంపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. వ్యాక్సినేషన్‌లో రోజుకో రికార్డు క్రియేట్‌ చేస్తూ దూసుకెళ్తోంది. ఎంతలా అంటే, అభివృద్ధి చెందిన 7 దేశాలు అన్నీ కలిపి ఒక నెలలలో ఎన్ని టీకాలు ఇచ్చాయో, వాటికన్నా ఎక్కువ డోసులు మన దేశంలో వేశారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ డోసుల సంఖ్య ఇవాళ్టికి (అక్టోబరు 21.. గురువారం నాటికి) 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతోంది.

అన్ని రైళ్లలో, మెట్రో రైళ్లలో, విమానాల్లో, షిప్స్‌ల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ విజయాన్ని లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రకటించాలని సర్కారు డిసైడ్‌ అయ్యింది. అలాగే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసులకు చేరిన సందర్భంగా సింగర్‌‌ కైలాశ్‌ ఖేర్‌ ఆలపించిన పాటను, ఒక ఆడియో విజువల్‌ ఫిల్మ్‌ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం నాటికి మన దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories