ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి : డబ్ల్యూహెచ్ఓ

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి : డబ్ల్యూహెచ్ఓ
x
Highlights

ఈ ఏడాది చివరి నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఈ విషయాన్నీ..

ఈ ఏడాది చివరి నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన వైరల్ సంక్రమణకు నివారణ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఈ ప్రకటన కొత్త ఆశను రేకెత్తిస్తోంది. మహమ్మారిపై ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో మాట్లాడిన ప్రధాన కార్యదర్శి టెడ్రోస్ అధనామ్, ఈ ఏడాది చివరి నాటికి ప్రజలకు COVID-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం, ఆశ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకారం అందించుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.. ఆ దిశగా వివిధ దేశాల అధినేతల హామీ వ్యాక్సిన్ పంపిణి సమయంలో అత్యవసరమని టెడ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచ దేశాలు ఇప్పటికే కోవాక్స్ పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి.ఈ కూటమి ఆధ్వర్యంలో 9 వ్యాక్సిన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కల్లా ఫైజర్ పెనీ అనే అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ సంస్థ తయారు చేస్తున్న టీకాపైనే అందరి దృష్టి ఉంది. ఇక ఈ తొమ్మిది వ్యాక్సిన్లు ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇదిలావుంటే రెండోసారి కరోనా వైరస్‌ సోకితే తక్కువ ప్రభావం ఉంటుందనే కొందరి వాదన సరికాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది.. అందువల్ల కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇదిలావుంటే ప్రాణాంతక వైరస్ 35,675,704 మందికి సోకింది 1,047,220 మందిని బలితీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories