Coronavirus: రాజస్థాన్‌లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు

Coronavirus: రాజస్థాన్‌లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు
x
Representational Image
Highlights

మంగళావారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయానికి రాజస్థాన్‌లో 61 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో నాగౌర్‌లో 17, దుంగార్‌పూర్‌లో 11, సికార్‌లో 8,...

మంగళావారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయానికి రాజస్థాన్‌లో 61 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో నాగౌర్‌లో 17, దుంగార్‌పూర్‌లో 11, సికార్‌లో 8, కోటాలో 6, సిరోహిలో 4, ఉదయపూర్‌లో 3, జైపూర్‌లో 2, హలవార్, బరాన్ లలో ఒక్కోటి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 5906 కి చేరుకుంది.

ఇదిలాఉంటే కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం రాత్రి సమీక్షించారు.. అనంతరం లాక్డౌన్ 4.0 కింద మినహాయింపులు ఇచ్చారు. మాల్స్ ల‌లో కొన్నింటికి అనుమతి ఉంటుందని, అయితే దుకాణాలు మాత్రం మూసివేయబడతాయని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు విద్యాేతర పనుల కోసం మాత్రమే తెరవాలని సూచించారు. ఇదిలాఉంటే రాష్ట్రంలోని కంటోన్మెంట్ జోన్ మినహా మిగిలిన ప్రదేశాలలో దంత వైద్య క్లినిక్ల నిర్వహణకు జోన్ వారీగా అనుమతి ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories