మహారాష్ట్రలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
x
Representational Image
Highlights

మహారాష్ట్రలో గురువారం కొత్తగా 2,598 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 59,546 కు చేరుకుంది, తద్వారా 60,000 మార్కుకు చేరుకుంది.

మహారాష్ట్రలో గురువారం కొత్తగా 2,598 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 59,546 కు చేరుకుంది, తద్వారా 60,000 మార్కుకు చేరుకుంది. అలాగే 85 మరణాలు కూడా సంభవించాయి. ఇది ఒక రోజులో నమోదైన దానిలో మూడవ అత్యధిక సంఖ్య. దీనితో, రాష్ట్ర మరణాల సంఖ్య 1,982 గా ఉంది.. 2,000 మార్కుకు చాలా దగ్గరగా ఉంది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో 287 మంది మరణించారు. గురువారం నమోదైన మొత్తం మరణాలలో 37 గత రెండు రోజుల్లో సంభవించాయని, మిగతా 48 మంది మే 15 నుంచి 25 వరకు ఉన్నారని రాష్ట్రం తెలిపింది.

రాష్ట్రంలో మరణాల రేటు 3.32% గా ఉందని.. మొత్తం మరణాలలో 38 మంది ముంబైకి చెందినవారు ఉన్నారు. దీంతో ముంబై నగర సంఖ్య 1,135 కు చేరుకుంది. మహారాష్ట్రలోని 116 మంది పోలీసు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే గతంలో కరోనా భారిన పడిన ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించారు. తాజా కేసులతో, మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 2,211 కి పెరిగింది.



Show Full Article
Print Article
Next Story
More Stories