Coronavirus: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Coronavirus: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
x
Representational Image
Highlights

భారత్‌పై కరోనా వైరస్‌ విజృంభణ కోనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, వివిధ రాష్ట్రాల్లో 175 మంది మృతిచెందారు....

భారత్‌పై కరోనా వైరస్‌ విజృంభణ కోనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, వివిధ రాష్ట్రాల్లో 175 మంది మృతిచెందారు. దీంతో భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అర్ధమవుతోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 71,105 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు, అలాగే 4,706 మంది మృతిచెందారు. ప్రస్తుతం 89,987 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
Next Story
More Stories