చిదంబరానికి మాట్లాడే అవకాశమిచ్చిన కోర్టు..తీర్పును 30 నిమిషాల పాటు రిజర్వ్‌..

చిదంబరానికి మాట్లాడే అవకాశమిచ్చిన కోర్టు..తీర్పును 30 నిమిషాల పాటు రిజర్వ్‌..
x
Highlights

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. మరికాసేపట్లో చిదంబరం కస్టడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పునివ్వనుంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. మరికాసేపట్లో చిదంబరం కస్టడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పునివ్వనుంది. సీబీఐ తరపున సొలిసటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలకు చిదంబరం తరపున వాదించిన లాయర్ కపిల్ సిబల్ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. చిదంబరానికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని మరో న్యాయవాది అభిషేక‌ మను సింఘ్వి చేసిన వినతిని కోర్టు అంగీకరించింది. దీంతో చిదంబరం తన వాదనను వినిపించారు. సీబీఐ అడిగిన చాలా ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని చిదంబరం తెలిపారు. తాను లంచం అడిగానన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇరు వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును 30 నిమిషాల పాటు రిజర్వ్‌లో ఉంచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories