గంటలో రూ.5 లక్షల కోట్లు

గంటలో రూ.5 లక్షల కోట్లు
x
Highlights

నిర్మలా సీతారామన్ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోయాయి. గత కొద్దిరోజులుగా నేలచూపులు చూసిన మార్కెట్లు ఆర్థికమంత్రి నిర్ణయంతో ఆకాశానికంటాయి. గత...

నిర్మలా సీతారామన్ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోయాయి. గత కొద్దిరోజులుగా నేలచూపులు చూసిన మార్కెట్లు ఆర్థికమంత్రి నిర్ణయంతో ఆకాశానికంటాయి. గత పదేళ్ల కాలంలోలేని విధంగా కీలక సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 2000 పాయింట్లపైగా దూసుకెళ్లింది. సెన్సెక్స్‌ 1992 పాయింట్లు దూసుకెళ్లి 38వేలకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. నిఫ్టీది కూడా ఇటే బాట 600 పాయింట్లకుపైగా ఎగిసి 11,300 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఒక్క గంటలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లలో లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)కు రూ. 5 లక్షల కోట్లు జమ అయ్యాయంటేనే మార్కెట్ల జోరు తెలుసుకోవచ్చు. లాభాల్లో రికార్డుమోత మోగిస్తోంది. ఒకరోజులో ఇదే అతిపెద్ద లాభాల నమోదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories