లాక్‌డౌన్ కొనసాగించే ఆలోచనలో మోదీ సర్కార్?

లాక్‌డౌన్ కొనసాగించే ఆలోచనలో మోదీ సర్కార్?
x
Narendra Modi (File Photo)
Highlights

కరోనా వైరస్‌ను వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

కరోనా వైరస్‌ను వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. క‌రోనా రోజు రోజుకు పెరుగుతుండ‌టంతో లాక్ డౌన్ ఎత్తివేత‌పై చాలా రాష్ట్రాలు కొన‌సాగించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాయి. లాక్ డౌన్ మ‌రో రెండు వారాలు పొడిగించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్ డౌన్ జూన్ 2వరకు పొడిగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలానే యూపీ, త‌మిళ‌నాడు, మ‌హ‌రాష్ట్ర‌ల ముఖ్య‌మంత్రులు కూడా లాక్ డౌన్ పొడిగించాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే కూడా లాక్‌డౌన్ పొడిగించాల్సిందే అని ప్రకటన చేశారు.

ఈ నెల 14వ తేదీ దేశ‌మంత‌టా లాక్ డౌన్ ముగియ‌నుంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే జ‌నం అంద‌రూ ఒక్కసారిగా రోడ్ల‌పైకి వ‌చ్చే పరిస్థితి ఉంటుంది. దీంతో క‌రోనా మ‌హ‌మ్మ‌రిని పూర్తిగా క‌ట్ట‌డి చేయ‌డం ప‌క్క‌న‌పెడితే ఇంకా పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇదే పలు రాష్ట్రాలు, నిపుణులు అంచాన వేస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా లాక్‌డౌన్ విష‌యంలో కేసీఆర్ తో ఏకిభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక సీఎం యెడ్యూర‌ప్ప కూడా లాక్ డౌన్ కొన‌సాగించాల‌నే అభిప్రాయంతో ఉన్నార‌ని తెలుస్తోంది.

లాక్ డౌన్ విషయంలో అన్ని రాష్ట్రాల‌నుంచి ఏకాభిప్రాయం కుదిరే అవ‌కాశం ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప‌లు రాష్ట్రాల ఉన్నాధికారులతో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రాలు పట్టుబడుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ కొనసాగించాల‌ని యోచిస్తోంది. లాక్‌డౌన్ పొడిగించ‌నున్న‌ట్లు కేంద్ర అధికారికంగా ప్ర‌క‌ట‌ణ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నాయని.. కేంద్రం దీనిపై ఆలోచనలు చేస్తోందని విశ్వస‌నీయ వ‌ర్గాలు చెప్పినట్లు AN Iవార్తా సంస్థ స్ప‌ష్టం చేసింది. బీసీజీ స‌ర్వే కూడా భార‌త్ లో క‌రోనా పెరిగే అవకాశం ఉంటుంద‌ని, జూన్ నెల వ‌ర‌కు కొన‌సాగించాల‌ని తెలిపింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories