ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిక... మూడో దశకు కరోనా?

ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిక... మూడో దశకు కరోనా?
x
Representational Image
Highlights

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4281కి చేరింది. మ‌ర‌ణాల‌ సంఖ్య 111గా ఉంది. సోమవారం ఒక్క రోజే దేశంలో ఏడు వంద‌ల‌పైగా కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4281కి చేరింది. మ‌ర‌ణాల‌ సంఖ్య 111గా ఉంది. సోమవారం ఒక్క రోజే దేశంలో ఏడు వంద‌ల‌పైగా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో 500కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 1,445 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశంలో క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కూ విదేశీయుల నుంచే వ్యాపించింది. కానీ తాజాగా కొన్ని రోజులుగా కరోనా వైర‌స్ భార‌తీయుల నుంచి భార‌తీయుల‌కు వ్యాపిస్తోంది. కాగా... దేశంలో క‌రోనా ముడో ద‌శ‌కు చేరింద‌ని ఎయిమ్స్ వైద్యులు డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అనుమానం వ్యక్తం చేశారు.

నాలుగు దశలుల్లో కరోనా వైరస్ వ్యాప్తిలో ఉంటుంది. మొదటి దశలో విదేశీయులు ద్వారా భారత్‌లోకి ప్ర‌వేసిస్తే.. విదేశీయుల ద్వారా భారతీయులకు కరోనా వైరస్ సోకితే అది రెండో దశకు వస్తుంది. భారతీయుల నుంచి భారతీయులకు కరోనా మూడో దశ కిందకు వస్తుంది. ఇక నాలుగో దశలో దేశంలో వారి నుంచి కరోనా సోకిన భారతీయుల ఇతరులకు ఆ వైరస్ వ్యాపిస్తూ ఉంటుంది. మూడు, నాలుగో దశలు అత్యంత ప్రమాదకరమైనవి.

ముఖ్యంగా మూడో దశలో కరోనా కట్టడి చెయ్యలేకపోతే, నాలుగో దశకు కరోనా చేరిందంటే తీవ్ర పరిణామాలు తప్పవు. దేశంలోని కొన్నిప్రాంతాల్లో కరోనా 3వ‌ దశ కనిపిస్తోందని ఎయిమ్స్ తెలిపింది. మూడో దశపై కేంద్ర అధికారిక ప్రకటన చేస్తే అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం కాక తప్పదు. ఇప్ప‌టికే చైనా, ఇంగ్లండ్, అమెరికా, స్పెయిన్ స‌హా ప‌లు దేశాల్లో మూడో దశ వచ్చింది. అందువల్ల భారత్‌లోనూ మూడో దశ రావడం సాధారణ అంశమే అంటోన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories