దేశంలోని వివిధ రాష్ట్రాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు

దేశంలోని వివిధ రాష్ట్రాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు
x
Highlights

గుజరాత్‌లో గత 24 గంటల్లో 524 కరోనా కేసులు వచ్చాయి. అలాగే 28 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,628 కేసులుండగా... అందులో 17,090 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1534 మంది చనిపోయారు.

* గుజరాత్ ‌లో గత 24 గంటల్లో 524 కరోనా కేసులు వచ్చాయి. అలాగే 28 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,628 కేసులుండగా... అందులో 17,090 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1534 మంది చనిపోయారు.

* వెస్ట్ బెంగాల్ లో ఈ రోజు 415 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,909కి చేరింది. ఇందులో 4985 మంది మరణించారు. 5,386 మంది చికిత్స పొందుతున్నారు.

*గోవా లో ఈ రోజు 37 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 629కి పెరిగింది. ఇందులో 544 యాక్టివ్‌ కేసులు.

* రాజస్థాన్ ‌లో కొత్తగా 235 కరోనా కేసులు వచ్చాయి. 177 మంది కొత్తగా రికవరీ అవ్వగా, ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,216 మంది కరోనా బారిన పడగా, 9,962 మంది రికవరీ అయ్యారు. 9,736 మంది డిశ్ఛార్జి అయ్యారు. 308 మంది చనిపోయారు.

* మహారాష్ట్ర లోని ధారావి ప్రాంతంలో కొత్తగా 21 మందికి కరోనా సోకింది. దీంతో ధారావిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,089కి చేరింది.

* మణిపూర్ ‌లో కొత్తగా 10 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 500కి చేరింది. ఇందులో 159 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 341 మంది చికిత్స పొందుతున్నారు.* కేరళలో ఈ రోజు 79 కొవిడ్‌-19 కేసులు వచ్చాయి. వీటితో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,366కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నయమై 1,234 మంది డిశ్ఛార్జి అయ్యారు.

* జమ్ముకశ్మీర్‌ లో గత 24 గంటల్లో 78 కరోనా కేసులు వచ్చాయి. ఇందులో 62 కశ్మీర్‌ డివిజన్‌ నుంచి రాగా, 16 జమ్ము డివిజన్‌లో నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు 5,298 కేసులు గుర్తించారు. ఇందులో 63 మంది చనిపోగా... 2,454 మంది చికిత్స పొందుతున్నారు.

* యూపీ లో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,259కి పెరిగింది. ఇందులో ఈ రోజు వచ్చినవి 516. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,904 మంది రికవరీ అయ్యారు. మరోవైపు కొవిడ్‌తో 435 మంది చనిపోయారు. రాష్ట్రంలో కొవిడ్‌ రికవరీ 61 శాతంగా ఉంది.

*అస్సాం లో మొత్తం కేసుల సంఖ్య 4,319కి పెరిగింది. అందులో ఈ రోజు వచ్చినవి 10. ప్రస్తుతం రాష్ట్రంలో 2,205 మంది రికవరీ అవ్వగా, 2,103 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో ఎనిమిది మంది చనిపోయారు.

* ఉత్తరాఖండ్ ‌లో ఈ రోజు ఇప్పటివరకు 67 కరోనా కేసులు వచ్చాయి. వీటితో కలిపి ఇప్పటివరకు 1,912 మంది కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,194 మంది రికవరీ అవ్వగా, 680 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. అందులో ఈ రోజు మృతి చెందింది ఐదుగురు.

* హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఈ రోజు తాజాగా మూడు కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 559 కరోనా కేసులు నమోదుకాగా... అందులో యాక్టివ్‌ కేసులు 184.

*

Show Full Article
Print Article
More On
Next Story
More Stories