తమిళనాడులో భారీగా పెరిగిన కేసులు.. ఒక్క రోజే 1384 కేసులు

తమిళనాడులో భారీగా పెరిగిన కేసులు.. ఒక్క రోజే 1384 కేసులు
x
Highlights

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1384 పాజిటివ్ కేసులు, 12 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా...

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1384 పాజిటివ్ కేసులు, 12 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 27,256కి చేరింది. ఇప్పటివరకు 220 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,304 కేసులు నమోదు కాగా, 260 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,16,919 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,06,737 ఉండగా, 1,04,107 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, 6,075 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories