కర్ణాటకలో కొత్తగా 239 కేసులు నమోదు..

కర్ణాటకలో కొత్తగా 239 కేసులు నమోదు..
x
Highlights

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక కర్ణాటక కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 239 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య...

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక కర్ణాటక కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 239 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మీద కర్ణాటక కరోనా కేసుల సంఖ్య 5,452కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 61 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,257 గా ఉంది. ఇప్పటివరకు 2,132 మంది కోలుకున్నారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9971 కేసులు నమోదు కాగా, 287 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,46,628 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,20,406 ఉండగా, 1,19,292 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 6929 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,42,069. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 46,66,386. భారత్ లో 48.02 గా కరోనా రికవరీ రేటు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories