తమిళనాడులో కొత్తగా 743 కోవిడ్ కేసులు..దేశవ్యాప్తంగా రికవరీ రేటు 39.6 శాతం

తమిళనాడులో కొత్తగా 743 కోవిడ్ కేసులు..దేశవ్యాప్తంగా రికవరీ రేటు 39.6 శాతం
x
Representational Image
Highlights

తమిళనాడులో బుధవారం 743 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకేసులు13,191 గా ఉన్నాయి.

తమిళనాడులో బుధవారం 743 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకేసులు13,191 గా ఉన్నాయి. బుధవారం నమోదైన కేసులలో చెన్నైలో 557 , చెంగల్పట్టులో 58 కేసులు, తిరువల్లూరులో 23 కేసులు వచ్చాయి.. ఈ రోజు 3 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 87 గా ఉంది. అలాగే ఈరోజు ఏకంగా 987 డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఈ రోజు వరకు 5,882 మంది డిశ్చార్జ్ అవ్వడంతో మొత్తం 7,219 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇదిలావుంటే దేశంలో మొత్తం క్రియాశీల కోవిడ్ -19 కేసులు దేశంలో 61,149 వద్ద ఉన్నాయి.. 42,298 మంది కోలుకున్నారు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు, రికవరీ రేటు భారతదేశంలో కేవలం 7 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు రికవరీ రేటు 39.6 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories