Coronavirus: ప్రస్తుతానికి ఊరట ఇదేనా..!

Coronavirus: ప్రస్తుతానికి ఊరట ఇదేనా..!
x
Highlights

గత 24 గంటల్లో కొత్తగా 65 మరణాలతో, కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య భారతదేశంలో 937 కు చేరుకుంది.

గత 24 గంటల్లో కొత్తగా 65 మరణాలతో, కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య భారతదేశంలో 937 కు చేరుకుంది. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసిన డేటా ప్రకారం, కోవిడ్ -19 తో సంబంధం ఉన్న 65 మరణాలు 24 గంటల్లో నమోదయ్యాయి, ఇది భారతదేశంలో అతిపెద్ద సింగిల్-డే స్పైక్. ఇక దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 29,000 దాటింది. గత 24 గంటల్లో 1,500 కి పైగా కేసులతో మొత్తం 29,974 కు చేరుకున్నాయి. అయితే ఇందులో 7,026 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం 22,010 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఊరట కలిగించే వార్త ఏమిటంటే, భారతదేశంలో కరోనా భారిన పడిన వారిలో 23.34 శాతం మంది కోలుకున్నారు, ఏ సంఖ్య ముందు రోజు 22 గా ఉంది. రికవరీ అయిన వారిలో 111 మంది విదేశీ పౌరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories