దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో భారీగా పెరిగిన కేసులు

దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో భారీగా పెరిగిన కేసులు
x
Representational Image
Highlights

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. కరోనా కేసుల సంఖ్య 70,756కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 3,604 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. కరోనా కేసుల సంఖ్య 70,756కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 3,604 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 46,008 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 22,454 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 23,401 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 24 గంటల్లోనే 1230 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లోనే 1230 కొత్త కేసులు వచ్చాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గడిచిన 24 గంటల్లో కరోనాతో 19 మంది మరణించారు. నగరంలో కరోనా కేసుల సంఖ్య 6086కు చేరింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటింది. తెలుగు రాష్ట్రాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories