Coronavirus Updates In Delhi: దేశ రాజధానిలో అధికశాతం మందికి కరోనా

Coronavirus Updates In Delhi: దేశ రాజధానిలో అధికశాతం మందికి కరోనా
x
Coronavirus in Delhi
Highlights

Coronavirus Updates In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో 24 శాతం మందికి కరోనా సోకినట్టు సర్వేలు వెల్లడించాయి.

Coronavirus Updates In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో 24 శాతం మందికి కరోనా సోకినట్టు సర్వేలు వెల్లడించాయి. అయితే కరోనా లక్షణాలు కొంతమందిలో కనిపించకపోవడంతో తమకు వైరస్సోనిక విషయం గుర్తుపట్టలేక పోతున్నారని సర్వే తెలిపింది. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో సర్వే చేసినా లక్షణాలు కనిపించని కేసులు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని సర్వే ప్రతినిధులు తెలిపారు.

ఢిల్లీలో క‌రోనా విస్ఫోట‌నం సంభ‌వించ‌బోతోందా? ఊహించిన దానికంటే తీవ్ర‌స్థాయిలో అక్క‌డ ప్ర‌మాదం పొంచి ఉందా.. అంటే అవున‌నే అంటున్నాయి స‌ర్వేలు. స్వ‌యంగా ఢిల్లీ ప్ర‌భుత్వం, కేంద్రహోంశాఖ‌, జాతీయ వ్యాధి నివార‌ణ కేంద్రం సంయుక్తంగా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ఊహించ‌ని ఫ‌లితాలు వెలుగుచూశాయి.దేశ రాజ‌ధాని ఢిల్లీలో 23.48 శాతం ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ బారినప‌డిన‌ట్టు స‌ర్వేలో తేల‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఇటీవల నిర్వహించిన సెరో- ప్రివ‌లెన్స్ అధ్యయనం( sero-prevalence study) ద్వారా ఈ విషయం బ‌య‌ట‌ప‌డింది.

ఢిల్లీలో కరోనా తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో.. ప్రభుత్వమే స్వ‌యంగా ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఆ వివరాలను తాజాగా వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం ఢిల్లీలోని 23.48 శాతం ప్రజల్లో శ‌రీరంలో యాంటీబాడీలు ఏర్పడినట్టు గుర్తించింది. అంటే అంత మందికి క‌రోనా సోకింద‌ని తెలిపింది. కరోనా ల‌క్ష‌ణాలేవి లేక‌పోవ‌డంతో.. అందులో చాలా మందికి త‌మ‌కు వైర‌స్ సోకింద‌న్న విషయాన్ని గుర్తించ‌లేక‌పోయార‌ని స‌ర్వే తెలిపింది.

జూన్ 27 నుంచి జూలై 10 వరకు.. ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు. ఇందుకోసం 21 వేల‌387 మంది నమూనాలను సేకరించి పరీక్షించారు. అయితే ఈ స‌ర్వేను చూసి మొత్తం జ‌నాభాలో అంత‌మందికి కరోనా సోకింద‌ని నిర్ధారించలేమ‌ని నిపుణులు చెప్తున్నారు. కొన్ని ఏరియాల్లో వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని.. కొన్ని ప్రాంతాల్లో త‌క్కువ‌గా ఉంద‌ని.. కాబ‌ట్టి ఢిల్లీ మొత్తం ఒకే స్థాయిలో వైర‌స్ సోకింద‌ని చెప్ప‌డానికి ఇవి స‌రైన ఆధారాలు కావ‌ని వాదిస్తున్నారు. ఏదేమైనా ఢిల్లీ జనాభాలో చాలా మందికి కరోనా ముప్పు ఉంద‌ని.. నియంత్రణ చర్యలు కఠినంగా చేపట్టాలని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories