ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే వార్త చెప్పిన కేజ్రీవాల్

ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే వార్త చెప్పిన కేజ్రీవాల్
x
Arvind Kejriwal (File Photo)
Highlights

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కోవిడ్ -19 పై మాట్లాడారు..

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కోవిడ్ -19 పై మాట్లాడారు.. ఢిల్లీలో గతవారం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పారు. కేసులు దాదాపు 200 తక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. ఈ వారం గత వారం కంటే కొంచెం మెరుగ్గా ఉందని.. తక్కువ సంఖ్యలో కేసులు, తక్కువ మరణాలు ఉండటంతోపాటు.. చాలా మంది ప్రజలు పూర్తిగా కోలుకున్నారని అన్నారు.

కరోనా వ్యాప్తి చెందిన ఏడవ వారంలో 850 కేసులు, 21 మరణాలు , 260 రికవరీలు నమోదయ్యాయని, అయితే ఎనిమిదవ వారంలో (గత వారం) మాత్రం 622 కేసులు, 9 మరణాలు , 580 రికవరీలు ఉన్నాయని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.దీన్ని బట్టి చూస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక కేంద్రం యొక్క మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ పై సడలింపులను అమలు చేస్తుందని ప్రకటించిన ఆయన, "ప్రజలకు అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. మాల్స్ , మార్కెట్లు , షాపింగ్ కాంప్లెక్స్ తెరవబడవు. నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను మాత్రమే అనుమతించబడతాయని అన్నారు.. అయితే హాట్‌స్పాట్స్‌లో ఉండే షాపులకు అనుమతి లేదన్నారు కేజ్రీవాల్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories