ఒక్కో వ్యక్తిపై క్వారంటైన్ ఖ‌ర్చు ఎంతో తెలుసా?

ఒక్కో వ్యక్తిపై క్వారంటైన్ ఖ‌ర్చు ఎంతో తెలుసా?
x
Representational Image
Highlights

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు దేశంలో దేశంలో మొత్తం 21,393 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు దేశంలో దేశంలో మొత్తం 21,393 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1409 కొత్త కేసులు అయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలలో రాజస్తాన్ ఒకటి.. అక్కడ ఇప్పటివరకి 1900కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా అనుమానితులతో పాటు గా ‌లక్షణాలు ఉన్నవారితోపాటు పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్న సంగతి తెలిసిందే..

అయితే రోగుల‌పై ఒక రోజుకు ఒక వ్యక్తిపై గ‌రిష్టంగా రూ.2,440 రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయాల‌ని రాజస్తాన్ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో ఆహారం, పానీయాల కోసం రూ .600 ఖర్చు చేయనున్నారు. ఇందులో అల్పాహారం మీద రూ .100, భోజనం మరియు విందుకు రూ. 180, నీటిపై రూ .80, టీ, స్నాక్స్ కోసం కేటాయించనున్నారు. అలాగై లినైన్‌, లాండ్రీపై రూ.60ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. అలాగే రూ.550ను క్లీనింగ్‌, డిసిన్ఫెక్షన్‌కు కోసం కేటాయించారు. ఇక రూ.500ను క్వారంటైన్‌లోని స్టాఫ్ ఆహారం కోసం కేట‌యించ‌గా.. హెల్త్ వ‌ర్కర్ల పీపీఈ కోసం రూ.600ను ఖ‌ర్చుచేయ‌నున్నారు. అలాగే రూ.100 స్ప్రేయింగ్ మిష‌న్ కోసం కేటాయించ‌గా.. రూ.30ను గార్డ్ కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories