దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
x
Highlights

భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 27 వేల 274 కు పెరిగింది.

భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 27 వేల 274 కు పెరిగింది. తమిళనాడులో 759, ఢిల్లీలో 591, కర్ణాటకలో 196, రాజస్థాన్‌లో 163, బీహార్‌లో 179, ఒడిశాలో 80, అస్సాంలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 47. వచ్చాయి.. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ఆధారంగా ఉన్నాయి. అయితే దేశంలో 1 లక్ష 25 వేల 101 మంది కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 69 వేల 597 మంది చికిత్సలో ఉన్నారు, 51 వేల 783 మంది నయమయ్యారని.. 3720 మంది మరణించారని వెల్లడించింది.

గత 24 గంటల్లో బిఎస్‌ఎఫ్ సిబ్బందిలో 21 మందికి కరోనా ఇన్‌ఫెక్షన్ నిర్ధారించబడింది. ఈ పారామిలిటరీ ఫోర్స్‌కు చెందిన 286 మందికి కరోనా రోగం నయం అవ్వగా, 120 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్ లతో ఫోన్లో మాట్లాడారు.. కరోనాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories