చైనా నుండి ఢిల్లీ చేరుకున్న భారతీయులు.. అందులో కర్నూలు జ్యోతి..

చైనా నుండి ఢిల్లీ చేరుకున్న భారతీయులు.. అందులో కర్నూలు జ్యోతి..
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో చిక్కుకున్న 76 మంది భారతీయులు మరియు విదేశీ పౌరులతో ఫిబ్రవరి 27 న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ప్రత్యేక విమానం...

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో చిక్కుకున్న 76 మంది భారతీయులు మరియు విదేశీ పౌరులతో ఫిబ్రవరి 27 న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో బంగ్లాదేశ్ నుండి 23 మంది, చైనా నుండి 6, మయన్మార్ మరియు మాల్దీవుల నుండి 2 మరియు దక్షిణాఫ్రికా, యుఎస్ఎ మరియు మడగాస్కర్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే కర్నూలుకు చెందిన యువతి జ్యోతి కూడా ఉన్నారు. వీరిలో ఎవరికీ కూడా కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే వారిని తరలించారు.

కాగా జ్యోతి భారత్‌కు వచ్చినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా జ్యోతి ఇండియాకు వస్తునట్లు ఫోన్ వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కరోనా వైరస్ విజృంభించడంతో.. చైనాలోని చిక్కుకున్న భారతీయులను స్వదేశం చేర్చేందుకు మొదట రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి.

కానీ.. జ్యోతిని తీసుకొచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు. దీంతో కుంటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పెద్దలను కూడా కలిశారు.

మరోవైపు తాజాగా ఢిల్లీ చేరుకున్న వీరంతా మునుపటి బ్యాచ్‌ల మాదిరిగా 14 రోజుల నిర్బంధంలో ఉంటారు. ఇక అంతకుముందు, సి -17 గ్లోబ్ మాస్టర్ విమానం భారతదేశం నుండి 15 టన్నుల వైద్య సామాగ్రితో వుహాన్లో ల్యాండ్ అయింది. ఇందులో భారతదేశం నుండి పంపిన మాస్కులు , చేతి తొడుగులు మరియు ఇతర అత్యవసర వైద్య పరికరాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 1 మరియు 2 తేదీలలో భారతదేశం రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలను చైనాకు పంపింది.. ఇందులో భాగంగా 647 మంది భారతీయ పౌరులను, ఎక్కువగా విద్యార్థులు మరియు ఏడుగురు మాల్దీవుల పౌరులను విమానంలో తీసుకువచ్చింది. మరోవైపు చైనాలో కరోనావైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 2,744 కు చేరుకుంది. ఇప్పటివరకు ధృవీకరించబడిన కేసుల సంఖ్య దాదాపు 80 వేలు దాటింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories